: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. కిందటి రోజుతో పోలిస్తే భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వార్త రాసే సమయంలో (ఏప్రిల్ 17 ఉదయం 10 గంటలకు) 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1250 తగ్గగా తులం ఇప్పుడు రూ. 1,41,350 వద్ద కొనసాగుతుంది. దీనికి ముందు వరుసగా చూస్తే రూ. 200, రూ. 1300, రూ. 1350 చొప్పున పెరిగాయి. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర విషయానికి వస్తే ఇవ్వాళ రూ. 1370 తగ్గడంతో గ్రాములకు రూ. 1,54,200 వద్ద ఉంది.ఇది పెరిగింది. తగ్గినప్పటికీ మరోవైపు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 2.75 లక్షల వద్ద ఉంది. ఏప్రిల్ 14, 15 తేదీల్లో చూస్తే ఇది వరుసగా రూ. 5000, రూ. 10 వేల చొప్పున పెరిగింది.ఇది ఇలా ఉండగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్సుకు 4830 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు అది 4790 డాలర్లకు చేరింది. సిల్వర్ రేటు కూడా 81 డాలర్ల నుంచి 79 డాలర్లకు దిగొచ్చింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకుంది. ప్రస్తుతం రూ. 92.78 వద్ద ఉంది.ఇరాన్ యుద్ధంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. ఒకసారి యుద్ధం ముగిసిందని.. మరోసారి భీకర దాడులు చేస్తామని అంటున్నారు. ఇప్పుడు కూడా ఇరాన్.. . అయితే ఇరాన్ దీనిని ఖండించింది. అలాంటి ఒప్పందం ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఇలా చెప్తూనే.. ఇరాన్ ను ఆర్థికంగా మరింత దెబ్బకొట్టేందుకు.. ఆ దేశ చమురుపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్లీ ఎగబాకాయి. దీంతో మళ్లీ గోల్డ్ ఆకర్షణ కోల్పోయి ధర తగ్గింది. ఇదే సమయంలో.. ఇరాన్‌తో యుద్ధం గురించి.. ప్చ్ రెండు నెలలు మాత్రమే యుద్దం చేశామని.. అమెరికా గతంలో 4 ఏళ్లు, 12 ఏళ్లు ఇలా సుదీర్ఘంగా యుద్ధం చేసిందని అన్నారు. ఇరాన్‌పై దాడులు చేసి ప్రపంచానికి నష్టం కలగకుండా చేశామని.. తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు.