ఆర్టీసీ బస్సుల బంద్‌పై బిగ్ అలర్ట్.. సమ్మె సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు

Wait 5 sec.

హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు చర్చలకు ఆర్టీసీ జేఏసీ నేతలను ఆహ్వానించారు. కార్మికులు చేస్తున్న డిమాండ్లను పరిశీలించేందుకు ఈ స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ.. కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై చర్చించనుంది.ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ సమ్మె ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం తాజాగా చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ ఈడీ వెంకన్న, సీపీఎం ఉషాదేవి నుంచి ఆర్టీసీ జేఏసీ కీలక నేతలకు పిలుపు వచ్చింది. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఆర్థిక, కార్మిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. ఇక వైస్ ఛైర్మన్, ఎండీ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని సమస్యలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేపట్టి 4 వారాల గడువులోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. అంతకుముందు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని సమ్మె చేయకుండా ఉండేందుకు దానికి పరిష్కారం ఆలోచించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని.. బస్సు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలనేనే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో నిర్ణయాలను అమలు చేయడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. సమస్యల పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తేల్చి చెప్పారు.అదే సమయంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లను లోతుగా అధ్యయనం చేసేందుకు నలుగురు ఉన్నత అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.. తమ డిమాండ్లు, విజ్ఞప్తులను కమిటీకి సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రోజూ 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణాలు చేస్తూ ఉంటారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లోని పేదలకు బస్సు ప్రయాణమే ఆధారమని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు.. ఆర్టీసీపైనా ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడను రక్షిస్తూనే కార్మికుల ప్రయోజనాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై పట్టుబట్టి ఉండకుండా.. కమిటీ ముందు కార్మిక సంఘాలు తమ బాధలు చెప్పుకోవాలని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని చర్చలకు సహకరించాలని సూచించారు. సమస్యను ముగించి ప్రజారవాణా సాఫీగా జరిగేలా చూడాలని కోరారు.