YSRCP: అంబటి రాంబాబుకు షాక్.. మళ్లీ కేసు..

Wait 5 sec.

మాజీ మంత్రి, నమోదైంది. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సోమవారం రోజున అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. తన ఇంటి మీద దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు ఏప్రిల్ 18న నిరాహార దీక్ష చేశారు. అయితే అంబటి రాంబాబు అనుమతుల్లేకుండా కలెక్టరేట్‌ ఎదురుగా నిరాహార దీక్ష చేశారని నగరంపాలెం పోలీసులు చెప్తున్నారు. కలెక్టరేట్ ఎదురుగా దీక్ష వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని.. వేరే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని ముందే చెప్పినప్పటికీ .. అంబటి రాంబాబు అనుమతుల్లేకుండా దీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని పేర్కొంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.మరోవైపు అంబటి రాంబాబు ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుతో పాటుగా.. అక్రమంగా లాటరీ నిర్వహించారనే కేసులను అంబటి రాంబాబు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో. అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు అంబటి రాంబాబు నివాసం వద్ద భీభత్సం సృష్టించారు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు అంబటి. అయితే తనను అరెస్ట్ చేసిన పోలీసులు.. తన ఇంటిపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. తన ఇంటిపై దాడి చేసి తననే రాజమండ్రి జైలులో పెట్టారన్న అంబటి రాంబాబు.. దాడి చేసిన వారిని జైళ్లో పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. తన ఇంటిపై దాడి ఘటన మీద న్యాయపోరాటం చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బెదిరింపులకు బెదిరేది లేదని.. ఎవ్వరికీ భయపడేది లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.