MI vs PBKS: ముంబై కమ్ బ్యాక్ ఇస్తుందా? పంజాబ్‌ టెర్రర్‌ను పాండ్యా టీమ్ తట్టుకోగలదా..!

Wait 5 sec.

లో ఇవాళ బిగ్ ఫైట్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ను తట్టుకుని నిలబడ్డ జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్‌తో పాండ్యా సేన సమరానికి సిద్ధమైంది. ను ఈ మ్యాచ్‌లో ఎలాగైనా దెబ్బకొట్టాలని ముంబై చూస్తుంటే.. సర్పంచ్ సాబ్ మేనియాతో మరోసారి సొంతగడ్డపై ముంబైని మట్టికరిపించాలని పంజాబ్ పట్టుదలతో ఉంది. ఇక ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఎంఐ ఒకటి మాత్రమే గెలిచి మిగతా మూడింటిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ముంబై, హ్యాట్రిక్ ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబై ఎలాగైనా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్ ఓటమి ఎరుగకుండా నాలుగు మ్యాచ్‌లలో ఒకటి వర్షంతో రద్దవగా, మిగతా మూడింటిలో గెలిచి మూడో స్థానంలో ఉంది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ చరిత్రలో ముంబైతో ఢీకొట్టిన ఏకైక జట్టు పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 34 మ్యాచ్2లు జరిగితే ముంబై ఇండియన్స్ 17, పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్‌లలో విజయం సాధించి సరిసమానంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ మూడు గెలవగా, ముంబై రెండింటిలో విజయం సాధించింది. గతేడాది ఐపీఎల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబైని పంజాబ్ మట్టికరిపించింది. ఐపీఎల్ 2025లో నువ్వా - నేనా అన్నట్టు సాగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ వన్ మ్యాన్ షోతో ముంబై డగౌట్‌లో కన్నీళ్లు నింపాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 203/6 పరుగులు చేయగా.. శ్రేయాస్ అయ్యర్ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 19 ఓవర్లలో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ రివేంజ్‌ని ఈ రోజు తీర్చుకోవాలని ముంబై చూస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు అంచనార్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షేర్ఫేన్ రూధర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్. పంజాబ్ కింగ్స్ జట్టు అంచనాప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కాన్‌లీ, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, మార్కస్ స్టాయినీస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్ కుమార్ వైశాక్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.