హర్మూజ్‌ జలసంధి వద్ద ఇటీవల తాము స్వాధీనం చేసుకున్న నౌకలో ఇరాన్‌కు చైనా ఇచ్చిన బహుమతి ఉందని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలిసిందే. ఇందులో క్షిపణి తయారీకి ఉపయోగించే చైనా రసాయనాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యాను.. ఎందుకంటే నాకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చాలా మంచి అనుబంధం ఉంది.. ఆయనతో నాకు ఒక అవగాహన ఉందని నేను అనుకున్నాను. కానీ పర్వాలేదు, యుద్ధం అంటే అలాగే ఉంటుంది, కదా?’’ అని సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవల హర్మూజ్‌ జలసంధిలో అమెరికా స్వాధీనం చేసుకొన్న నౌక చైనా (China) నుంచి ఇరాన్‌కు వెళుతోందని నిక్కీ హేలీ పేర్కొన్నారు. క్షిపణి తయారీలో వినియోగించే రసాయనాలను అందులో తరలిస్తున్నట్లు ఆరోపించారు. నౌకను ఆపాలని యూఎస్ దళాలు అనేకసార్లు హెచ్చరించినా, అది పట్టించుకోలేదన్నారు. దీంతో యుద్ధంలో ఇరాన్‌కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలు, ఉద్రిక్తతలకు సంబంధించి మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఈ సంఘటనను ప్రస్తావించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని తాను గతంలో చేసిన హెచ్చరిక.. ఆ దేశం క్షిపణులను తరలించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందని ఆయన అన్నారు. రెండు వారాల కాల్పుల విరమణ సమయాన్ని ఆయుధాలను సమకూర్చుకోడానికి ఇరాన్ ఉపయోగించుకుని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆ నౌకను ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు, అది చైనా జెండాతో ఉందా? లేదా కచ్చితంగా ఏమి తీసుకువెళుతోంది? అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.ఇరాన్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను అందించినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలు చైనా ఖండించింది. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును చైనా ఆపకుంటే 50% అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగడంపై బీజింగ్ తీవ్రంగానే స్పందించింది. ఇటీవల హర్మూజ్‌ జలసంధిలో అమెరికా స్వాధీనం చేసుకొన్న నౌకలో చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు వెళ్తున్నాయని ఐరాసలో అమెరికా మాజీ రాయబారి, రిపబ్లిక్ నేత నిక్కీ హేలీ ఆరోపించారు. నౌకను ఆపాలని తమ సైన్యాలు పలుసార్లు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేయడంతో దానిపై దాడిచేసి సీజ్ చేశారు. యుద్ధంలో ఇరాన్‌కు చైనా సైనిక సహకారం అందిస్తోందనే విషయాన్ని తోసిపుచ్చలేమని ఆమె వ్యాఖ్యానించారు.