ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు ఉప్పల్ స్టేడియం రీ సౌండ్ వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్‌కి వచ్చిందంటే స్కోర్ బోర్డు బద్దలవ్వాల్సిందేనని మరోసారి నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వీరంగం సృష్టించాడు. 47 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. అభిషేక్ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 242 పరుగులు చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ గెలిచిన మూడు మ్యాచ్‌లు కూడా తొలుత బ్యాటింగ్ చేసినవే కావడం విశేషం. ఢిల్లీపై కూడా ఫస్ట్ బ్యాటింగ్‌కి వచ్చిన ఆరెంజ్ ఆర్మీ తన మార్క్ బ్యాటింగ్ చూయించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. పవర్ ప్లేలో 67 పరుగులు జోడించిన ఈ జంట.. తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ సీజన్‌ ఆరంభం నుంచి స్ట్రగుల్ అవుతున్న ట్రావిస్ హెడ్.. ఢిల్లీపై క్రీజులో ఎక్కువసేపు నిలుచున్నా భారీగా స్కోర్ చేయలేకపోయాడు. 26 బంతులు ఆడిన హెడ్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంత సేపూ భారీగా స్కోర్ చేసేందుకే ప్రయత్నించాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. సెంచరీ తర్వాత అభిషేక్‌ పెద్దగా ఆడలేకపోయాడు. దాంతో హెన్రిచ్ క్లాసెన్ పవర్ స్ట్రయికింగ్‌తో బౌండరీలు బాదాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు లుంగీ ఎంగిడి, టి. నటరాజన్ స్లో బాల్స్ వేసి ఆఖర్లో బౌండరీలను కట్టడి చేశారు. ఈజీగా 250 పరుగులు చేస్తుందనుకున్న సన్‌రైజర్స్ రన్స్‌కే పరిమితమైంది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. అభిషేక్ - క్లాసెన్ కలిసి 32 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.