ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హ్యట్రిక్ విక్టరీతో విజయోత్సాహంలో మునిగిపోయింది. భారీ స్కోర్ ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడిన్పటికీ ఓటమి తప్పలేదు. 47 పరుగుల మార్జిన్‌తో గెలిచిన పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మార్క్ బ్యాటింగ్‌తో మరోసారి విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో క్లాసెన్ అదరగొట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 242/2 స్కోర్ చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ పాతూమ్ నిస్సాంక వికెట్ కోల్పోయింది. 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా ఫస్ట్ డౌన్‌లో వచ్చిన నితీష్ రాణా సన్‌రైజర్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఒకానొక దశలో డేంజరస్‌గాాా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఈషాన్ మలింగ దెబ్బ కొట్టాడు. ఢిల్లీ స్కోర్ 107 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ను షాకీబ్ హుస్సేన్ అవుట్ చేయగా.. ఆ తర్వాత ఓవర్‌లోనే నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్లను ఇషాన్ మలింగ వెంటవెంటనే అవుట్ చేశాడు. దాంతో 107 పరుగులకే ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఢిల్లీ బ్యాటర్లు బౌండరీలు బాదుతూనే ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్ - సమీర్ రిజ్వీ కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ 33 బంతులు ఆడగా స్టబ్స్ 27, రిజ్వీ 32 పరుగులు బాదారు. ఈ డేంజరస్ పార్ట్‌నర్‌షిప్‌ను మళ్లీ ఇషాన్ మలింగానే బ్రేక్ చేశాడు. వరుస బౌండరీలు బాదుతున్న స్టబ్స్‌ 16 బంతుల్లో 27 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో ఢిల్లీ 166 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అశుతోష్ 14, అక్షర్ 2, సమీర్ రిజ్వీ 41 పరుగులు చేసి అవుటయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దాంతో సన్‌‌రైజర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ మలింగ నాలుగు ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకోగా.. హర్ష్ దూబే 2 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.