. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి రానుంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి జోష్‌తో ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చినా ప్లేయింగ్ 11లో మాత్రం ఆడటం లేదు. కమిన్స్ తర్వాత మ్యాచ్ నుంచి అందుబాటులోకి రానున్నాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఎస్కే మీద గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లే కీలకంగా మారారు. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో, ఢిల్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా నిలవనున్నాడు. ఆరంభంలో విఫలమైన కేఎల్ రాహుల్ ఆర్సీబీపై కీలక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకంగా మారాడు. అదేవిధంగా ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ ఉప్పల్ పిచ్‌లో రెచ్చిపోయే అవకాశం ఉంది. బౌలర్లలో మాజీ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ నటరాజన్ ఈ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కోలుకుని, ఈ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సన్‌రైజర్స్ కీలక బ్యాటర్ అభిషేక్ శర్మను అక్షర్ గతంలో రెండుసార్లు అవుట్ చేశాడు.. దాంతో పవర్ ప్లేలో బౌలింగ్‌కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షాకీబ్ హుస్సేన్, ఈషాన్ మలింగ. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకేఎల్ రాహుల్, పాతూమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, ముకేశ్ కుమార్, టి. నటరాజన్.