ప్రకాష్ రాజ్‌కు టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్

Wait 5 sec.

సినీ నటుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.. రామలక్ష్మణులను ఉత్తరాది వలస కూలీలుగా . సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. భానుప్రకాష్ రెడ్డి తరుఫున ఆయన అడ్వకేట్‌ ప్రకాష్ రాజ్‌కు ఈ లీగల్‌ నోటీసులు పంపించారు. ఉన్నాయని.. ప్రకాష్ రాజ్ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసుల్లో డిమాండ్‌ చేశారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై బహిరంగ వ్యాఖ్యలు చేశారని.. ఆయన వ్యాఖ్యలతో కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ వారం రోజుల్లోపు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే.. ఆయన మీద రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామంటూ భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు. మరోవైపు కేరళలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. రామాయణంపైనా, రామలక్ష్మణులపైనా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రామలక్ష్మణులు ఉత్తర భారతం నుంచి దక్షిణాదికి వచ్చిన వలసకూలీలుగా ప్రకాష్ రాజ్ వర్ణించటంపై హిందువులు మండిపడుతున్నారు. దక్షిణాదిలోని గిరిజన తెగకు చెందిన రావణుడి తోటలో పండ్లను రామలక్ష్మణులు దొంగిలించారంటూ.. ఇదే యుద్దానికి దారితీసినట్లుగా ప్రకాష్ రాజ్ చేసిన విశ్లేషణ హిందువులలో ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మీద కొన్నిచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి.. జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామంటూ హెచ్చరించారు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారనేదీ చూడాల్సి ఉంది.