: స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మంచి రాబడి అందిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ లాంగ్ రన్‌లో రిస్క్ కూడా తగ్గుతుందని చెప్పొచ్చు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా సంపద విశేషంగా పెరుగుతుంటుంది. కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ. దీని వల్ల కాలం గడుస్తున్న కొద్దీ సంపద పెరుగుతూనే ఉంటుంది. అందుకే.. చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. స్వల్ప కాలంలో కంటే లాంగ్ రన్‌లోనే కాంపౌండింగ్ మ్యాజిక్ ఎక్కువగా పనిచేసి.. రాబడి ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో చాలా చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించి.. ఎక్కువ కాలం కొనసాగించాలని నిపుణులు చెబుతుంటారు. మార్కెట్ అనిశ్చితిలోనూ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అద్భుతంగా రాణిస్తుంటాయి. ఇటీవల ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర ప్రభావం చూయించినప్పటికీ.. మార్చి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల విలువ రూ. 40 వేల కోట్లకుపైగా రావడం విశేషం. సిప్ పెట్టుబడుల విలువ రూ. 32 వేల కోట్లకుపైగానే ఉంది. ఇక అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా, వాల్యూ రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం.. 3 పీఎస్‌యూ ఫోకస్డ్ ఫండ్స్.. ఎస్బీఐ పీఎస్‌యూ డైరెక్ట్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్, ఆదిత్యబిర్లా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్.. మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధులపై టాప్ పెర్ఫామర్లుగా నిలిచాయి. ఇక్కడ అత్యధికంగా 34 శాతానికిపైగా CAGR రిటర్న్స్ అందించడం విశేషం. ఐదేళ్ల కాల వ్యవధిలో ఎస్బీఐ పీఎస్‌యూ డైరెక్ట్ ఫండ్ 34.18 శాతం సీఏజీఆర్ రిటర్న్స్‌తో టాప్ పెర్ఫామర్‌గా నిలిచింది. ఇక్కడ సిప్ పెట్టుబడులపై 26.99 శాతం రిటర్న్స్ వచ్చాయి. నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ చేసిన వారికి ఐదేళ్లలో రూ. 12 లక్షలు వచ్చాయి. ఆదిత్య బిర్లా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ 25.07 శాతం రిటర్న్స్ ఇవ్వగా.. ఇక్కడ రూ. 10 వేల సిప్‌ను రూ. 11.25 లక్షలుగా మలిచింది. ఇన్వెస్కో ఇండియా పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్ 25.20 శాతం రిటర్న్స్ అందించగా.. రూ. 10 వేల సిప్ రూ. 11.18 లక్షలుగా అయింది. ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 5,891 కోట్లుగా ఉండగా.. ఇన్వెస్కో పీఎస్‌యూ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 1335 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లా ఫండ్ విషయానికి వస్తే దీని ఏయూఎం (అసెట్స్ అండర్ మేనేజ్మెంట్) రూ. 5,334 కోట్లుగా ఉంది. గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అప్పుడే మెరుగైన రాబడి ఆశించవచ్చు. పైన ఇచ్చింది సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు.