తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకానికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధించింది.. ప్రభుత్వ పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలపై నిషేధం విధిస్తూ మార్కెటింగ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ పూల అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని.. లైసెన్స్ కూడా రద్దు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మార్కెట్లు, రైతు బజార్లలో సహజ పూలను, వాటి ఉత్పత్తులనే విక్రయించేలా చూడాలని అన్ని జిల్లాల అధికారులకు సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్‌లలో సహజ పూలను పక్కన పెట్టి.. ఎక్కువగా ప్లాస్టిక్‌ పూలను అమ్ముతున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మేళాలకు హాజరయ్యారు. కొంతమంది రైతులు ఈ ప్లాస్టిక్‌ పూల విక్రయాల వల్ల సహజ పూల విక్రయాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ పూల కారణంగా తాము నష్టపోతున్నామని మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంపై తుమ్మల నాగేశ్వరరావు స్పందించి.. మార్కెట్లలో ప్లాస్టిక్‌ పూల అమ్మకాలకు అనుమతించవద్దని ఆదేశించారు. మార్కెటింగ్‌శాఖ ప్లాస్టిక్ పూలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ మాత్రమే కాదు.. మరికొన్ని రాష్ట్రాలు కూడా గతంలోనే ప్లాస్టిక్ పూల అమ్మకాలపై నిషేధం విధించాయి. వాస్తవానికి తీసుకుంటోంది. ప్లాస్టిక్‌తో కాకుండా పేపర్, క్లాత్, జనపనారతో తయారు చేసే సంచులను ప్రజలు ఉపయోగించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ పరిధిలో కూడా ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు. సింగిల్ యూస్డ్) ప్లాస్టిక్‌ వస్తువులపై పూర్తి నిషేధం విధించాలని నిర్ణయించింది.. ప్లాస్టిక్‌ నిషేధం కోసం చట్ట సవరణ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు. అయితే ప్లాస్టిక్ పూల విషయంలో ఫిర్యాదులు రావడంతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి నిషేధం విధించారు. ఈ నిర్ణయాన్ని రైతులు స్వాగతించారు.. తమ సమస్యను పరిష్కరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.