: ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనం అవుతున్నాయి. అయితే ఈ సంక్షోభ పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీల స్టాక్స్ రాణించాయి. ఇందులో ఒకటి . ఈ స్టాక్స్ రాణించడంతో.. ఆయన సంపద కూడా అదే స్థాయిలో విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టడం గమనార్హం. అయితే ఈ ఇరువురూ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్- 20 అత్యంత ధనవంతుల్లో నిలిచారు. భారత్ సహా అదానీ ఇప్పుడు ఆసియా మొత్తంలోనే అత్యంత ధనవంతుడు కావడం విశేషం. >> చాలా కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్.. అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఎట్టకేలకు ప్లేస్ మారిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ ఇటీవల రాణించడంతో సంపద విపరీతంగా పెరిగింది. మరోవైపు మార్కెట్ విలువ పడిపోవడంతో పాటు.. కూడా తగ్గింది. ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిచ్ లిస్ట్ ప్రకారం చూస్తే.. గౌతమ్ అదానీ సంపద 92.6 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 8.60 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అదానీ 19వ స్థానంలో నిలిచారు. ఇక ముకేశ్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మన కరెన్సీలో చూస్తే రూ. 8.43 లక్షల కోట్లుగా ఉంది. అంబానీ 20వ స్థానంలో కొనసాగుతున్నారు. స్టాక్స్ ధరలు సహా వ్యాపార పనితీరు కారణంగా ఈ ర్యాంకింగ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కానీ చాలా కాలంగా రిలయన్స్ షేరు రాణించడంతో.. అదానీ స్టాక్స్ పడిపోవడంతో వీరి స్థానాలు పెద్దగా మారే అవకాశం రాలేదు. వరల్డ్‌లో మస్క్ టాప్..ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల విషయానికి వస్తే టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ (X) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఒరాకిల్ బాస్ ల్యారీ పేజ్ 286 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుసగా జెఫ్ బెజోస్ (269 బి.డాలర్లు), సెర్జీ బ్రిన్ (266 బి.డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (239 బి.డాలర్లు), ల్యారీ ఎలిసన్ (230 బి.డాలర్లు), మైకేల్ డెల్ (170 బి.డాలర్లు), జాన్సెన్ హువాంగ్ (164 బి.డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (164 బి.డాలర్లు), జిమ్ వాల్టన్ (150 బి.డాలర్లు) టాప్- 10 లో నిలిచారు.