సీఎం చంద్రబాబును కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. హీరో సాయి శ్రీనివాస్ పెళ్లికి ఆహ్వానం!

Wait 5 sec.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు, టాలీవుడ్ హీరో సాయి శ్రీనివాస్‌ మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కావ్యారెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న బెల్లంకొండ ఫ్యామిలీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడుని కలిసి వివాహానికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. - కావ్యల వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. ఆ తర్వాత మే 1న హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కలసి తన వివాహానికి ఆహ్వానించారు సాయి శ్రీనివాస్‌. ఆయనతో పాటుగా బెల్లంకొండ సురేష్ దంపతులు, గణేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బెల్లంకొండ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ - కావ్య నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈనెల 29న తిరుపతిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది.