హర్మూజ్ తెరిచిన ఇరాన్.. దిగ్బంధనం కొనసాగుతోందని ట్రంప్ సంచలన ప్రకటన

Wait 5 sec.

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్న తరుణంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. అయితే, ఇరాన్‌తో చేసుకునే ఒప్పందం 100 శాతం పూర్తయినంత వరకూ హర్మూజ్ దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, అనేక వివాదాస్పద అంశాలపై చర్చలు ఇప్పటికే చాలా వరకు పూర్తయి, ఏకాభిప్రాయం కుదరిందని, ప్రక్రియ త్వరగానే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ పూర్తిగా తెరుచుకుని, వాణిజ్య నౌకల రాకపోకలకు 100 శాతం సిద్ధంగా ఉంది.. కానీ, ఇరాన్‌తో మా ఒప్పందం 100 శాతం పూర్తయ్యే వరకూ కేవలం టెహ్రాన్‌కు సంబంధించి మాత్రమే మా నేవీ దిగ్బంధనం కొనసాగుతుంది.. చాలా వరకు చర్చలు పూర్తయినందున ప్రక్రియ త్వరగా ముగిసే అవకాశం ఉంది’’ అని సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఒప్పందంపై సంతకం చేసేలా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం దిగ్బంధనాన్ని ఓ సాధనంగా వాడుకుంటోంది. ‘‘లెబనాన్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన మార్గంలో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్ జలసంధి అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తిగా తెరిచి ఉంటుంది’’ అని అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. హర్మూజ్ ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. క్రూడాయిల్ బ్యారెల్‌కు 10 శాతం మేర తగ్గడం విశేషం.అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఒప్పందం జరిగితే ఇంధన సరఫరా సులభతరం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం అప్పగించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. గతేడాది జూన్‌లో ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత భూగర్భంలో కూరుకుపోయిన యురేనియం నిల్వలను వెలికి తీయడానికి ఇరాన్‌తో కలిసి పనిచేస్తామని ట్రంప్ వివరించారు. అయితే, దీనిపై ఇరాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఆ దేశం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.