ఐపీఎల్ 2026లో తొలి విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. మరో గెలుపు కోసం పోరాటం మొదలుపెట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో చెపాక్‌లో చెన్నై వరుసగా రెండోసారి బ్యాటింగ్‌కి వచ్చింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు దాదాపు ఒకేలాగే ఆడుతున్నాయి. కేకేఆర్‌కి లక్‌తో ఒక పాయింట్ రాగా.. సీఎస్కే కమ్ బ్యాక్‌కి ఇచ్చి రెండు పాయింట్ల దక్కించుకుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు నాలుగు, నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. సీఎస్కే వరుసగా మూడు ఓడి, ఒక దాంట్లో విజయం సాధించింది. ఇక కేకేఆర్ కూడా మూడు మ్యాచ్‌లలో ఓడగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఒక పాయింట్ వచ్చింది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముఖ్యంగా కేకేఆర్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలని చూస్తుండగా, సీఎస్కే రెండో మ్యాచ్‌లోనూ గెలిచి తమ లెగసీని కాపాడుకోవాలని చూస్తోంది. ఆ కారణంతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీపై గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా, కేకేఆర్ మాత్రం ఒక ఛేంజ్‌తో వస్తోంది. చెన్నై లోకల్ బౌలర్ వరుణ్ చక్రవర్తిని కేకేఆర్ బరిలోకి తెచ్చింది. చెపాక్ కండీషన్స్ బాగా తెలిసిన వరుణ్ చక్రవర్తిలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణిస్తాడనే నమ్మకాన్ని కెప్టెన్ రహానే బలంగా వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌తో మొదలైన వరుణ్ చక్రవర్తి పతనం.. ఐపీఎల్ 2026లోనూ కొనసాగుతోంది. కనీసం సొంతగడ్డ మీదయినా కమ్ బ్యాక్ ఇస్తాడో, లేదో చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుసంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డివాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్‌జపనీత్ సింగ్, ఖలీల్ అహ్మద్. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుఅజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ.