.. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అదే సమయంలో తాజాగా కేంద్రం ప్రతిపాదనలు విడుదల చేయడంతో.. దానికి సంబంధించి.. అదే సమయంలో ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభ సీట్లను పెంచితే.. జనాభా నియంత్రణను కచ్చితంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భారీగా అన్యాయం జరుగుతుందని స్టాలిన్‌కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు.. జనాభా నియంత్రణలో కఠిన చర్యలు చేపట్టి.. జనాభా విస్ఫోటనాన్ని అడ్డుకున్నాయని.. ఇప్పుడు అదే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్‌ విషయంలో దక్షిణాది రాష్ట్రాల గొంతుకను బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని.. దానికి సమయం కూడా వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి పోరాడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో కూడా సమన్వయం చేసుకుంటూ అంతా కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణను తయారు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.ఇక ఈ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాల స్థాయిలోనే కాకుండా.. పార్లమెంట్‌లో కూడా గట్టిగా లేవనెత్తాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఎంపీలు అందరూ కలిసి.. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం చాలా అవసరమని గుర్తు చేశారు. ప్రస్తుత విధానంలో లోక్‌సభ సీట్ల పెంపును చేపడితే.. దక్షిణాదికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందని.. దీనిపై ఇతర సీఎంలతో భేటీ అయ్యి ఉమ్మడి పోరాటం చేయడం అవసరమని రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.