వ్యక్తిగత సహాయకులు (పీఏ) రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 39 ఏళ్ల రాజేష్ నాయుడు గత 20 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబానికి నమ్మకంగా పనిచేస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వద్ద తొలుత పీఏగా పనిచేసిన రాజేష్ నాయుడు.. ప్రస్తుతం ఎంపీ పీఏగా వ్యవహరిస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్ నాయుడు ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ నాయుడు బైక్ మీద కర్నూలుకు వస్తున్న సమయంలో.. వాహనం అదుపుతప్పింది. దీంతో రాజేష్ నాయుడు రోడ్డుపై పడిపోయారు. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. రాజేష్ నాయుడు మీదుగా వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన రాజేష్ నాయుడు.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో పీఏ రాజేష్ నాయుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఢిల్లీ నుంచి హుటాహుటిన కర్నూలుకు చేరుకున్నారు. రాజేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన శబరి.. అతని మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజేష్ నాయుడు కుటుంబసభ్యులను ఓదార్చిన బైరెడ్డి శబరి.. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజేష్ నాయుడు చనిపోయిన విషయం తెలుసుకున్న బైరెడ్డి అనుచరులు.. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు పీఏ రాజేష్ నాయుడు మృతిపై బైరెడ్డి శబరి ఎమోషనల్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా మా కుటుంబంతో కలిసి ఉన్న రాజేష్.. ఇకలేరనే సంగతి కలిచివేస్తోందంటూ ట్వీట్ చేశారు. "ఎన్నో ఏళ్లుగా మా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ, నాన్నకు, నాకు చేదోడువాదోడుగా ఉంటున్న రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో మనల్ని విడిచి వెళ్లిపోయారనే వార్త నన్నెంతో కలచివేసింది. ఈ లోటు మాటల్లో చెప్పలేనిది.. ఇది నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే ఉంది. ఆయన లోటు ఎప్పటికీ భర్తీ కాలేనిది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.." అంటూ బైరెడ్డి శబరి ట్వీట్ చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో రాయలసీమ సాధన కోసం కృషి చేశారు. అలాగే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పలు పోరాటాలు చేశారు. చేరారు. టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బైరెడ్డి శబరి.. నంద్యాల లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు.