పశ్చిమాసియాలో శాంతికి నాలుగు పాయింట్ల ప్రణాళికను ముందుకు తెచ్చిన.. భద్రతకు తమ వంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో చర్చలు విఫలమైన తర్వాత కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు మరొక దఫా చర్చలకు అమెరికా, ఇరాన్ ప్రయత్నిస్తున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. మంగళవారం అబుదాబి యువరాజు ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.నాలుగు పాయింట్ల ప్రతిపాదన ఏంటి?పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని దేశాల మధ్య శాంతియుత సహజీవన సూత్రం మొదటిది. ఆ ప్రాంతంలో సుస్థిరమైన భద్రతను నెలకొల్పేందుకు దేశాలు తమ సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు.రెండోది జాతీయ సార్వభౌమాధికారం సూత్రాన్ని దేశాలు గౌరవించాలని, దానిని ఉల్లంఘించకూడదని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమాసియా, గల్ఫ్‌లోని దేశాల భద్రత, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.మూడోది ప్రపంచాన్ని అస్తవ్యస్త పరిస్థితిల్లోని నెట్టకుండా నిరోధించడానికి, అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టడం అత్యవసరమని, ఐక్యరాజ్యసమితి ప్రధానాంశంగా ఉందని ఆయన పేర్కొన్నారు.నాలుగోది అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో మిళితం చేయడానికి ప్రయత్నించాలని, ప్రాంతీయ పురోగతి బలోపేతానికి చైనా తన ఆధునీకరణ ప్రయత్నాలను పంచుకుంటుందని తెలిపింది.అమెరికా దిగ్బంధనంపై చైనా ఆగ్రహంఇదే సమయంలోపై చైనా తీవ్రంగా మండిపడింది. ఇది ప్రమాదకరమైన, బాధ్యతారహిత ప్రవర్తన అని ఆరోపించింది. పశ్చిమాసియాలో శాంతిని పెంపొందించడంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని జిన్‌పింగ్ ప్రతిజ్ఞ చేశారు.వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత గల్ఫ్‌లోని ఇరాన్ నౌకాశ్రయాలు, దాని తీర ప్రాంతాలలోకి వచ్చిపోయే నౌకలను నిర్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అన్నట్టుగానే ఆమెరికా దళాలు సోమవారం నుంచి యుద్ధ విమానాలు, భారీ నౌకలతో ఇరాన్ సముద్ర జలాల్లోకి ప్రవేవించారు. చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసిని ఇరాన్.. భారత్, చైనా వంటి స్నేహపూర్వక దేశాలనౌకలను మాత్రమే దాటడానికి అనుమతిస్తుంది.