ఇస్లామాబాద్‌లో చర్చలు విఫలం.. ‘‘మిమ్మల్ని మేము ఎలా నమ్మేది’’ అంటూ ఇరాన్ సూటి ప్రశ్న

Wait 5 sec.

ఇరాన్, అమెరికాల మధ్య దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిశాయి. అయితే చర్చల గురించి తెలిసిన 11 మూలాలు ఇరు దేశాల మధ్య ఒప్పందానికి ఇప్పటికీ ఆస్కారం ఉందని పేర్కొన్నాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాతజరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే.ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో ఈ చర్చలు జరిగాయి. తొలుత అమెరికా, ఇరాన్‌లతో మధ్యవర్తిత్వ దేశాలు వేర్వేరుగా.. తర్వాత ఉమ్మడిగా సమావేశం నిర్వహించాయి. కూడా చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది. ఈ జల సంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయనప్పటికీ.. తక్షణమే తెరవాలని అమెరికా కోరింది. ఇరాన్ అణు కార్యక్రమం, టెహ్రాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. చర్చలు జరుగుతున్న ప్రధాన మందిరంలోకి మొబైల్ ఫోన్లను కూడా అనుమతించలేదు. దీంతో అమెరికా వైస్-ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ ఘలీబాఫ్‌ సహా వాషింగ్టన్, టెహ్రాన్ ప్రతినిధులు విరామ సమయంలో బయటకు వెళ్లి తమ దేశాలకు సమాచారం అందజేయాల్సి వచ్చిందిన ఇరు వర్గాలు వెల్లడించాయి. ‘ఒకానొక దశల్లో ఒప్పందం కుదురుతుందనే బలమైన ఆశలు చిగురించాయి.. కానీ, క్షణాల్లో పరిస్థితి మారిపోయింది’అని పాకిస్థాన్ ప్రభుత్వ వర్గం ఒకటి తెలిపింది. చర్చలలో పాల్గొన్న మరొక మూలం.. తక్షణమే పరిష్కరించలేని నిర్ణయాలకు ముందు ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి 80 శాతం దగ్గరగా వచ్చాయని చెప్పారు. సీనియర్ ఇరాన్ వర్గాలు అనుకూలతలేని వాతావరణంగా పేర్కొన్నాయి. అయినప్పటికీ చర్చలు సాఫీగా జరిగేలా పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ, ఇరుపక్షాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి సుముఖత చూపలేదు.ఇరాన్‌కు చెందిన వర్గాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున వాతావరణం కొంత మెరుగ్గా అనిపించిందని, చర్చలు పొడిగించే అవకాశం ఏర్పడింది. అయితే, అభిప్రాయబేధాలు మాత్రం కొనసాగాయి. ఇరాన్ అర్థం చేసుకోవడంలో విఫలమైందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, అమెరికా ఉద్దేశాలపై ఇరాన్‌కు నమ్మకం లేకపోవడం కూడా ప్రధాన ఆందోళనకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గంటకో ప్రకటన చేస్తూ ఉండటంతో ఇరాన్‌కు నమ్మకం కలగడం లేదు. మరోసారి చర్చలు జరిగే అవకాశం అందుకే అమెరికాను తాము ఎలా విశ్వసిస్తామని ప్రశ్నిస్తోంది. చాలా సున్నితమైంది కావడంతో గోప్యంగా వెల్లడించిన వర్గాల ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం సమావేశంలో అంతర్గత పరిస్థితులు, వాతావరణం, చర్చలు పొడిగించే సూచనలు ఉన్నప్పటికీ చివరికి ఎలా ముగిశాయో, అలాగే భవిష్యత్తులో మరింత సంభాషణకు అవకాశం ఇంకా ఉన్నదనే విషయాలు వెల్లడిస్తున్నాయి.