పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత, సర్జరీ.. పూర్తిగా కోలుకోవటానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వైద్యులు సర్జరీ నిర్వహించారు.శనివారం సాయంత్రం నిర్వహించినట్లు జనసేన పార్టీ, డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. గత కొద్ది నెలలుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారని.. దీంతో వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపింది. ఆస్పత్రిలో వైద్యులు పవన్ కళ్యాణ్‌కు వైద్య పరీక్షలు, ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారని.. వాటిని పరిశీలించిన అనంతరం శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు జనసేన పార్టీ తెలిపింది. సర్జరీ తర్వాత వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని.. ఆ తర్వాతే అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారని జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్, డిప్యూటీ సీఎంవో ప్రకటన విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీల నేతలు, కూటమి కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.