ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ద్వితీయ సంవత్సరానికి కూడా ఇంప్రూవ్‌మెంట్.. రూల్స్ ఇవే..

Wait 5 sec.

రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఇప్పటి వరకూమాత్రమే ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయని భావించే విద్యార్థుల కోసం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సబ్జెక్టులో అయితే తమకు మార్కులు తక్కువగా వచ్చాయో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. మొదటిసారి రాసిన పరీక్ష, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలలో దేన్లో ఎక్కువ మార్కులు వస్తే దానినే పరిగణనలోకి తీసుకుంటారు.అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఇప్పటి వరకూ ఈ అవకాశం ఉండగా.. ఇకపై సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే అమలవుతున్న ఇంప్రూవ్‌మెంట్ విధానాలను పరిశీలించిన తర్వాత.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలలో పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటనలో వివరించారు. మరోవైపు ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జరగనున్నాయి. జూన్ నాలుగో తేదీ వరకూ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ విధానాన్ని ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఏపీలో అమలు చేయనున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్.. నిబంధనలు ఇవే.. 2026 మార్చి నెలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు రాసి..పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ.. పాస్ అయిన సబ్జెక్టులలో మాత్రం ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ మార్కులనే పరిగణిస్తారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించేవరకూ పరీక్షలు రాసుకోవచ్చు. అందులో ఎలాంటి పరిమతి లేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. అలాగే ప్రాక్టికల్‌ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు 600 రూపాయలతో పాటుగా పాటు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. ఏప్రిల్‌ 20 నుంచి 27వరకు ఫీజు చెల్లించేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది.