దేశంలోని మహిళలందరికీ క్షమాపణలు.. జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోదీ ఎమోషనల్

Wait 5 sec.

వీగిపోయిన నేపథ్యంలో.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోని మహిళలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని చర్చించేందుకు తాను ఈ ప్రసంగం చేస్తున్నట్లు వివరించారు. దేశంలో మహిళల పురోగతిని ఎలా అడ్డుకున్నారో ప్రతీ పౌరుడు చూస్తున్నారని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం తాము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ.. విజయం సాధించలేకపోయామని వెల్లడించారు. నారీ శక్తి అధినియమ్‌లో సవరణలు చేయలేకపోయామని.. అందుకు దేశంలోని తల్లులందరికీ తాను క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.ఈ సందర్భంగా ఈ బిల్లు ఆమోదం పొందకుండా వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతిపక్షాలను ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం నారీశక్తిని అడ్డుకున్నారని మోదీ ఆరోపించారు. భారత దేశ మహిళల కలలను విపక్షాలు ధ్వంసం చేశాయని మండిపడ్డారు. దేశానికి మంచి చేయడమే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న ప్రధాని మోదీ.. కొంతమందికి మాత్రం దేశం కంటే తమ రాజకీయాలే కీలకమని ప్రతిపక్షాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి మంచి చేయడం కోసం.. నారీ శక్తి హితం కోసం ఈ బిల్లును తీసుకువచ్చామని చెప్పిన .. భారత్ ఇంకా మహిళా శక్తిని చూడాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో ప్రధానంగా కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ పార్టీలను ఉద్దేశించి ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి కుటుంబ పార్టీలు.. దేశంలో మహిళలను రాజకీయంగా ఎదగనీయవని మండిపడ్డారు. డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు బిల్లును మాత్రమే ఓడించలేదని.. మహిళా శక్తిని ఓడిపోయేలా చేశాయని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని భారత మహిళలు ఎన్నటికీ మర్చిపోరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి దేశ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును అడ్డుకున్న పార్టీలన్నింటికీ తప్పకుండా శిక్ష పడుతుందని మోదీ తెలిపారు.