తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈనెల 20న రైతు భరోసా నిధులు విడుదల

Wait 5 sec.

తెలంగాణలోని రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది.తాజాగా రెండో విడత ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ప్రకటించింది. ఈనెల 20వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఆ రోజున భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఇక రైతు భరోసా రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ విడతలో ఏకంగా రూ.5,653 కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడత రైతు భరోసా నిధులను 1.50 కోట్ల ఎకరాలకు సీఎం విడుదల చేశారు. ఆ సమయంలో రూ.3,590 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేశారు.రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులు.. ఈ కింద.. పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున అందుకుంటున్నారు. అయితే గత నెలలో విడుదల చేసిన తొలి విడత రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతీ రైతుకు ఒక ఎకరా చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించగా.. మిగిలిన సొమ్మును సోమవారం రోజున జమ చేయనుంది. అయితే ఈ రెండు విడతలే ఆగకుండా త్వరలోనే మరో విడతలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. వారి అకౌంట్లలో డబ్బులు జమచేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవలె వెల్లడించింది. ఇలా కొత్త పాస్ బుక్కులు కలిగిన రైతులు సుమారు 85 వేల మంది ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీరిలో ఇప్పటికే 62 వేల మంది ఈ పథకం కోసం అప్లై చేసుకున్నట్లు తెలిపారు. అయితే వీరికి కూడా ఈ రైతు భరోసా రెండో విడతలో భాగంగా కొత్త రైతులకు అందించనున్నారు.