2 శాతం పెరిగిన డీఏ.. ఏ స్థాయి ఉద్యోగులకు ఇప్పుడు జీతం ఎంత పెరుగుతుందో లెక్కలివే..

Wait 5 sec.

: , పెన్షనర్లకు శుభవార్త అందింది. చాలా కాలంగా ఎదురుచూస్తుంటే.. కరవు భత్యం (డీఏ) పెంపునకు కేంద్ర కేబినెట్ శనివారం రోజు ఆమోదం తెలిపింది. . పెన్షనర్లకు అందించే డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) కూడా 58 నుంచి 2 శాతం పెరిగి 60 శాతానికి చేరుతుంది. ఇవి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ప్రకటించినా.. 2026, జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి బకాయిలు కూడా అందుతాయి. డీఏ పెరిగితే నేరుగా ఉద్యోగులకు చేతికి అందే జీతం పెరుగుతుందని చెప్పొచ్చు. తాజాగా 2 శాతం డీఏ పెంపుతో.. ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ. 6791.24 కోట్ల మేర భారం పడనుంది. ఇక కేంద్రం నిర్ణయంతో సుమారు 50.46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. అదే విధంగా 68.27 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ అనేది ఉద్యోగుల బేసిక్ పే పై వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది నేరుగా ఉద్యోగుల జీతాల్ని ప్రభావితం చేస్తుందన్నమాట. పెరిగిన దానికి తగ్గట్లుగా బై హ్యాండ్ శాలరీ పెరుగుతుంది. మరి ఇప్పుడు ఏ స్థాయి ఉద్యోగులకు బేసిక్ పే ఎంత ఉంది.. ఇప్పుడు జీతం ఎంత పెరుగుతుందో చూద్దాం.లెవెల్ 1 ఉద్యోగికి రూ. 18 వేలుగా బేసిక్ పే ఉండగా.. 58 శాతం డీఏ ప్రకారం.. ఈ జీతం రూ. 28,440 గా ఉండగా.. ఇప్పుడు 2 శాతం పెరగడంతో అది రూ. 28,800 కి చేరుతుంది. ఇక్కడ తాజాగా రూ. 360 పెరుగుతుందన్నమాట. లెవెల్-2 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 19900 గా ఉండగా.. 2 శాతం డీఏ పెంపుతో రూ. 398 జీతం పెరుగుతుంది. లెవెల్-3 ఉద్యోగులకు ప్రస్తుతం కనీస వేతనం రూ. 21,700 గా ఉండగా.. రూ. 434 పెరిగి మొత్తం జీతం రూ. 34,720 కి చేరుతుంది. లెవెల్- 4 ఉద్యోగులకు చూస్తే రూ. 510 పెరిగి మొత్తం జీతం రూ. 40,800 కి చేరుతుంది. లెవెల్- 5 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 29,200 గా ఉండగా.. రూ. 584 పెరిగి రూ. 46,720 కి చేరుతుంది. లెవెల్ - 6 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 35,400 గా ఉండగా రూ. 708 పెరిగి రూ. 56,640 గా ఉంటుంది. లెవెల్- 7 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 44,900 గా ఉండగా.. రూ. 898 పెరిగి రూ. 71,840 కి చేరుతుంది. ఇదే విధంగా లెవెల్- 8 ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపుతో జీతం రూ. 952 పెరుగుతుంది. లెవెల్-9 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 53,100 గా ఉండగా.. వీరికి రూ. 1062 పెరుగుతుంది. అత్యధికంగా లెవెల్- 18 ఉద్యోగులకు రూ. 5 వేలు పెరిగి బేసిక్ పే రూ. 2.50 లక్షలుగా ఉండగా.. మొత్తం జీతం రూ. 4 లక్షలవుతుంది.