GT vs KKR: టాస్ గెలిచి షాకింగ్ డెసిషన్ తీసుకున్న రహానే.. కేకేఆర్‌లో బిగ్ ఛేంజ్!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. మ్యాచ్ లైవ్‌ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విజయం లేని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇదే వేదికపై టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ జరగడం.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించడంతో రహానే ఫస్ట్ బ్యాటింగ్ నిర్ణయం తీసుకుని ఉంటాడని భావిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ పాత జట్టుతోనే బరిలోకి దిగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడన్స్‌లో ఒక కీలక మార్పు ఉంది. ఫిన్ అలెన్‌ని పక్కనబెట్టిన కేకేఆర్ టిమ్ సైఫర్టీని బరిలోకి దింపుతోంది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచ్‌లలో ఆడితే, గుజరాత్ మూడు మ్యాచ్‌లలో గెలిచింది. ఇక నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ గుజరాతే విజయం సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లలో గెలిచి, రెండింటో ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐదు మ్యాచ్‌లలో ఆడితే ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలై, తొలి గెలుపు కోసం ఎదురుచూస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టుసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడా, అశోక్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అజింక్య రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, టిమ్ సైఫర్ట్, అంగ్‌క్రిష్ రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ.