ఆరోపిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖండిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు బ్యారేజీలు కుంగుబాటుకు గురి కావడంతో.. ఈ విమర్శలు తీవ్రం అయ్యాయి. మరోవైపు.. ఈనెల 20వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దెబ్బతిన్న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పునరుద్ధరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ్యారేజీల మరమ్మతు పనులతోపాటు.. శాశ్వతంగా కనుగొనాల్సిన పరిష్కారాల కోసం కీలక కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే పనుల సమన్వయం, పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ 3 బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేసుకోవడం.. అనుకున్న సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి ఉపయోగంలోకి తీసుకువచ్చే పనులను ఈ కమిటీ చూసుకోనుంది. వారానికి 2 సార్లు సమావేశం కానున్న ఈ కమిటీ పనుల పురోగతిని సమీక్షించనుంది. అదే సమయంలో నిత్యం జరిగే పనులపై రోజువారీ రిపోర్టులు కూడా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ బ్యారేజీలకు సంబంధించి కీలక పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల ఎంత పటిష్ఠంగా ఉన్నాయో తెలుసుకునేందుకు మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్ట్‌లు పూర్తి చేయాలని ఆదేశించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనలతోపాటు అనుమతుల మేరకు ఈ పనులు చేయనున్నారు. మొదట అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తి స్థాయిలో రెడీ చేసి.. ఆ తర్వాత పాక్షికంగా అయినా మేడిగడ్డ బ్యారేజీని కూడా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.