లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Wait 5 sec.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, లోక్‌సభలో వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 352 ఓట్లు రావాల్సి ఉండగా.. మూడింట రెండింతల మెజార్టీ సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో మిగతా రెండు బిల్లులు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2026లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. బిల్లు వీగిపోవడంతో నియోజకవర్గాలను 850కి పెంపునకు బ్రేక్‌లు పడ్డాయి. ఓటింగ్ ముగియడంతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రతిపక్షాలపై కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అవసరం. లోక్‌సభలో 537 మంది సభ్యుల ఉండగా.. మూడింట రెండు వంతుల మెజారిటీకి 360 సీట్లు అవసరం. 293 మంది సభ్యులున్న అధికార ఎన్డీఏకు 67 సీట్లు తక్కువగా ఉన్నాయి. రాజ్యసభలో మెజారిటీకి కావలసిన కీలక సంఖ్య 163 కాగా, 142 మందికి పైగా సభ్యులున్న ఎన్డీఏకు మెజారిటీ మార్కుకు 21 సీట్లు తక్కువగా ఉన్నాయి.గురువారం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చ అనంతరం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం వివరణ ఇచ్చారు. బిల్లును గంటలోనే మార్పులు సభలో ప్రవేశపెడితే మద్దతు ఇస్తారా? అని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత 543 స్థానాలు ఉండగా.. వాటిని 850కి పెంచాలని యోచించారు. కానీ, దక్షిణాది రాష్ట్రాలకు దీని వల్ల అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. మోదీ ప్రభుత్వం మాత్రం ఎవరికీ అన్యాయం జరగదని, వారికి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పింది.