కింగ్ తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ తన హోమ్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. 'కింగ్ 100' అనే వర్కింగ్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్డేడ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చేస్తుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటించని ఓ కీలక విషయం బయటకు వచ్చేసింది.'King 100' సినిమాని ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఏ విషయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే నాగార్జున క్యారక్టరైజేషన్, హీరోయిన్లు, సినిమా బ్యాక్ డ్రాప్ గురించి ఇలా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో కథానుగుణంగా నాగ్ మూడు వైవిధ్యమైన గెటప్స్ లో కనిపిస్తారని, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటి టబు, 'నాట్యం' ఫేమ్ సుస్మితా భ‌ట్ తో పాటుగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోందని చెప్పుకున్నారు. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య ఒక కథానాయిక అనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ‘కింగ్ 100’ షూటింగ్ కులు మనాలిలో జరుగుతోంది. అక్కడ అందమైన పర్వత ప్రాంతాలు, మంచు కొండల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించలేదు కానీ.. నాగార్జునతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు దిగిన ఫోటోలు, అక్కడ వెహికల్ లో నాగ్ వెళ్తున్నప్పుడు తీసిన వీడియోలు బయటకు రావడంతో అందరికీ స్పష్టత వచ్చేసింది. దీంతో నాగ్ లుక్ కూడా రివీల్ అయిపోయింది. 66 ఏళ్ల వయసులో నాగార్జున స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.ఇదిలా ఉంటే, ఐశ్వర్య రాజేష్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇందులో మంచు పర్వతాల్లో హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ గర్ల్ గా ముస్తాబై కనిపించింది. మరికొన్ని పిక్స్ లో టీ-షర్ట్ జీన్స్ ధరించి ఉంది. దీనికి 'మనాలి' అని క్యాప్షన్ పెట్టడంతో అక్కడ 'కింగ్ 100' షూటింగ్ లో పాల్గొంటోందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో డైరెక్టర్ రా. కార్తీక్ తో దిగిన సెల్ఫీ కూడా ఉండటంతో, ఇందులో ఒక హీరోయిన్ గా నటిస్తోందనే విషయం కన్ఫార్మ్ అయిపోయింది. ఇలా మనాలి లొకేషన్స్ లో నాగార్జున, ఐశ్వర్య రాజేష్ కనిపించడంతో, వారి మధ్య సీన్స్ షూట్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఇటీవల మైసూరులో జరిగిన షెడ్యూల్ కి సంబంధించిన పిక్స్, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఎలాగూ ఏదొక విధంగా అన్ని విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి, మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సందర్భం చూసుకొని ఫస్ట్ లుక్ తో పాటుగా ఇతర వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. ‘కింగ్ 100’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా రియలిస్టిక్ యాక్షన్ తో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని నాగ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాగార్జున సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తారని.. చూడవచ్చని, డిఫరెంట్ వెరైటీ గెటప్స్ లో కనిపిస్తారని దర్శకుడు రా.కార్తీక్ మరో ఇంటర్వ్యూలో చెప్పారు.