త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనేత్వరగా మెరుగవ్వాలని కోరుకుంటూ ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం.. నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 9:00 గంటలకు మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం జరగనుంది. ఈ విషయాన్ని అవనిగడ్డ జనసేన నేతలు తెలియజేశారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి మేడిశెట్టి సూర్యకిరణ్ నేతృత్వంలో సోమవారం ఆయుష్ హోమం నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా పరిపాలనలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పాదగాయ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనూ పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, మహా సౌరా యాగం నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామికి పంచామృతాలతో, రుద్రాభిషేకం పురుహతికా అమ్మవారికి కుంకుమ మాభిషేకం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ఆయుష్ హోమం,మృత్యుంజయ హోమం, మహా సౌర యాగం నిర్వహించారు. నిర్వహించినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు, పవన్ కళ్యాణ్ పది రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. సర్జరీ అనంతరం శ్వాస సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లు పవన్ కళ్యాణ్‌కు వివరించినట్లు తెలిసింది. పవన్‌కు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు జాతీయ స్థాయి నేతలు, సీఎం చంద్రబాబు నాయుడు సహా ఏపీ మంత్రివర్గం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి నేతలు ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ వేగంగా కోరుకోవాలని కోరుకున్నారు.