అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తిపడేస్తాం.. జగిత్యాల వేదిక నుంచి కేసీఆర్ కీలక ప్రకటన

Wait 5 sec.

తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలంతా ఆగమైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎటు పోతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వ్యవస్థపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను తీసి పడేస్తామని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చి.. పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని.. నిజామాబాద్‌కు నిడ్రాను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారని పేర్కొన్న కేసీఆర్.. రేపు జగిత్యాలకు జిడ్రా అని తీసుకొస్తాని సెటైర్లు వేశారు. పేదోళ్ల కొంపలు కూల్చడమే.. రాష్ట్ర ప్రభుత్వానికి కావాలా అని నిలదీశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజులోనే.. హైడ్రాను తీసేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూలగొడుతున్నారని మండిపడ్డారు. కనీసం పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనివ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. తాము అధికారాన్ని చేపట్టిన తర్వాత తొలి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 46 వేల చెరువులను పునరుద్ధరించామని చెప్పిన కేసీఆర్.. ఒక్క గుడిసెను కూడా పడగొట్టలేదని చెప్పారు.ఇక మూసీ ప్రాజెక్టు పేరుతో పేదోళ్లను ఏడిపిస్తున్నారని.. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని.. కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు కోసం 15 వేల ఇళ్లను కూలగొడతామని ప్రభుత్వం చెబుతోందని.. అది ధర్మమేనా అని నిలదీశారు. మూసీ నదిని మంచిగా చేయాల్సిందేనని తేల్చి చెప్పిన కేసీఆర్.. కానీ ఇళ్లను కూలగొట్టడం ఎందుకని ప్రశ్నించారు. పేదల భూములను కబ్జా చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప అందులో ఏమీ లేదని ఆరోపించారు. ఏది చూసినా దోపిడీ, గుండాగిరి, అరాచకంతో ముందుకెళ్తున్నారే తప్ప.. ప్రజల సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని విమర్శించారు.