SRH vs DC: హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన సన్‌రైజర్స్.. ఢిల్లీతో ఢీకి రెడీ!

Wait 5 sec.

వరుసగా రెండు విజయాలతో హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. హోం గ్రౌండ్ ఉప్పల్‌లో సీఎస్కేపై విజయం సాధించిన సన్‌రైజర్స్, ఇప్పుడు ఢిల్లీతో ఢీ కొట్టి రికార్డు బద్దలు కొట్టాలని చూస్తోంది. - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ రోజు రసవత్తర పోరు జరగనుంది. ఉప్పల్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ సీజన్‌లో హైదరాబాద్, ఢిల్లీ జట్లు సమాన విజయాలతో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడు గెలిచి, మూడు ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడితే రెండు ఓడి, మూడింటిలో విజయం సాధించింది. నెట్ రన్‌రేట్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో ఉంది. ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు పై స్థానానికి ఎగబాకనుండగా, ఓడిన జట్టు కిందికి వెళ్లనుంది. హెడ్ టు హెడ్ రిజల్ట్స్‌లో ఇరు జట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్‌లో 25 మ్యాచ్‌లు జరిగితే సన్‌రైజర్స్ ఒక్క విజయం ఆధిక్యంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌లలో గెలిచింది. ఉప్పల్ వేదికగా ఇరు జట్లు సమాన విజయాలు సాధించాయి. ఆరు మ్యాచ్‌లు జరిగితే ఆరెంజ్ ఆర్మీ మూడు, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, లియామ్ లివింగ్‌స్టోన్ / హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షాకీబ్ హుస్సేన్, ఈషాన్ మలింగ. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంచనాకేఎల్ రాహుల్, పాతూమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, ఆకీబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముకేశ్ కుమార్, టి.నటరాజన్.