భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధర.. రూ.5000 తగ్గిన వెండి.. ఈరోజు హైదరాబాద్‌లో రేట్లు ఇవే

Wait 5 sec.

Gold Rate Today: అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా మన దేశంలో బంగారం కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలో జరిగాయి. ఏకంగా రూ.20 వేల కోట్లు విలువైన బంగారం కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులను మరింత ప్రోత్సహించినట్లయింది. ఆ తర్వాతి రోజు సైతం తగ్గాయి. దీంతో పసిడికి మంచి గిరాకీ లభించింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసినట్లు తెలిపింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ప్రభావం బంగారం ధరలపై ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయం, దేశీయంగా ఏప్రిల్ 21వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడే మనం తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 23 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ 4787 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.22 శాతం మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ వెండి రేటు 78.93 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,42,350 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు సైతం మారలేదు. ఈరోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 1,55,290 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తలానికి రూ. 500 మేర దిగివచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గిన క్రమంలో దేశీయంగాను ధరలు తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి.రూ. 5000 తగ్గిన వెండిబంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 5000 మేర తగ్గి ఊరట కల్పిస్తుంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 2,75,000 మార్క్ వద్దకు దిగివచ్చి ట్రేడవుతోంది. కొద్ది రోజుల నుంచి వెండి రేటు వరుసగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ కాస్త తగ్గడం ఊరటగానే చెప్పవచ్చు.