Share Price: స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలం కంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడుల్ని కొనసాగించడం వల్ల అదనపు బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ లాంగ్ రన్‌లో కేవలం షేర్ ధర పెరగడంతో మాత్రమే కాదు.. కంపెనీలు ప్రకటించే బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్, డివిడెండ్లు వంటి వాటి వల్ల అదనంగా ఎలాంటి పెట్టుబడి లేకుండానే ప్రయోజనం పొందొచ్చు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 24న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై.. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి) ఫలితాలకు ఆమోదం తెలిపి.. అదే రోజున వెల్లడించనున్నారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో తెలిపిన సంస్థ.. మరో శుభవార్త చెప్పింది. >> 2026, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. షేర్ హోల్డర్లకు డివిడెండ్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. క్యూ4 ఫలితాల రోజే డివిడెండ్ ప్రకటన కూడా ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు గత 25 ఏళ్లలో.. 27 సార్లు డివిడెండ్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే 2025 ఆగస్టులో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 5.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దానికి ముందటి సంవత్సరాల్లో చూస్తే 2022, 2023, 2024 ల్లో వరుసగా రూ. 8, రూ. 9, రూ. 10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మరి ఈసారి డివిడెండ్ ఎంత ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. . మరి ఈసారి కూడా ఇలాంటి శుభవార్తలు ఇంకేమైనా ఉంటాయేమో చూడాలి. డివిడెండ్.. అంటే కంపెనీ ప్రకటించే రికార్డ్ తేదీలోపు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి ఎన్ని షేర్లను కలిగి ఉంటే.. దానికి ఒక్కో ఈక్విటీ షేరుకు డివిడెండ్ చెల్లిస్తుంది. ఉదాహరణకు రూ. 10 డివిడెండ్ ప్రకటించిందనుకోండి. 100 షేర్లు ఉన్న వారికి రూ. 1000 వస్తుంది. ఈ డబ్బులు నేరుగా షేర్ హోల్డర్ అకౌంట్లలోనే జమవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డింగ్ ప్యాట్రన్ చూస్తే డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం వరకు చూస్తే 42.06 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. డివిడెండ్ ప్రకటనతో వీరందరి అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3 (అక్టోబర్- డిసెంబర్) ఫలితాలు చూస్తే నికర లాభం స్వల్పంగా 1.6 శాతం పెరిగి రూ. 22,290 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ప్రాతిపదికన కార్యకలాపాల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.5 శాతం పెరిగి రూ. 2.69 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక . ప్రస్తుతం ఏప్రిల్ 21న రూ. 1360 స్థాయిలో ఉంది. మార్కెట్ విలువ రూ. 18.41 లక్షల కోట్లుగా ఉంది. గమనిక: పైన ఇచ్చింది సమాచారమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.