మొజ్తబా గ్రీన్ సిగ్నల్‌తో.. అమెరికాతో చర్చలకు సిద్ధమైన ఇరాన్.. నేడే సమావేశం!

Wait 5 sec.

: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలపై గత కొద్ది గంటలుగా నెలకొన్న సందిగ్ధత ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. సోమవారం రాత్రి జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో ఖమేనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.పరస్పర విరుద్ధ ప్రకటనలు.. వాస్తవానికి సోమవారం రోజు ఉదయమే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయీ మాట్లాడుతూ.. ఖరాఖండిగా చెప్పారు. "అమెరికా గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. డెడ్ లైన్లకు, అల్టిమేటమ్ లకు మేము తలవంచం" అని ఆయన ప్రకటించారు. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే ఇరాన్ చర్చలను ఆలస్యం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలకు అనుమతించడం దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.ట్రంప్ బాంబుల హెచ్చరిక.. జేడీ వాన్స్ పయనంమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్‌ను హెచ్చరించారు. తాను విధించిన 14 రోజుల కాల్పుల విరమణ ఏప్రిల్ 22వ తేదీతో ముగియనుందని.. ఆలోపు ఇరాన్ చర్చలకు రాకపోతే, ఆయన అల్టిమేటమ్ జారీ చేశారు. అలాగే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొగడించనని కూడా స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతల మధ్యే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మంగళవారం ఉదయం ఇస్లామాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఇరాన్ బృందంతో నేరుగా చర్చలు జరిపి, యుద్ధానికి స్వస్తి పలికేలా ఒక శాశ్వత ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా వైట్ హౌస్ ఈ పర్యటనను ప్లాన్ చేసింది.రేపటితో ముగియనున్న గడువు..ఏప్రిల్ 22వ తేదీన రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువుఅమెరికాతో చర్చలకు అసలు తమ వద్దే ప్రణాళికే లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ తలొగ్గింది. ముఖ్యంగా ఆ దేశ నూతన సుప్రీం లీడర్ మొజ్తభా ఖమేనీయే స్వయంగా అమెరికాతో చర్చలు జరపమని తమ ప్రతినిధులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే మంగళవారం రోజు రాత్రి ఇస్లామాబాద్ వేదికగా.. అమెరికా బృందంతో ఇరాన్ చర్చలు జరపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరి యుద్ధం ఆగిపోతుందా లేక కొనసాగుతుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ముగియనుంది. ఈ లోగా ఇస్లామాబాద్ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది. లేని పక్షంలో మరో భయంకరమైన యుద్ధానికి ప్రపంచం సాక్షిగా నిలవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి బంతి ఇరాన్ కోర్టులోనే ఉంది. ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకుంటారా? లేదా ట్రంప్ హెచ్చరించినట్లు యుద్ధ జ్వాలలు మొదలవుతాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.