తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ లేఖ.. డీజీపీ రియాక్షన్ ఇదే!

Wait 5 sec.

పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనను.. భారత్, పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్య.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ సూర్య చేసిన ఆ వ్యాఖ్యలపై తెలంగాణలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ విభజనపై తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన .. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన తేజస్వీ సూర్యకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తేజస్వీ సూర్య లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి పొన్నం.. లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చర్యలు చేపట్టాలంటూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి.. లోక్‌సభ సహా చట్టసభల్లో ఎంపీలు మాట్లాడిన మాటలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండదని డీజీపీ తేల్చి చెప్పారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజలను కించపరిచేలా లోక్‌సభ వేదికగా తేజస్వీ సూర్య మాట్లాడుతూ ఉంటే.. అక్కడే ఉన్న తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు మౌనంగా ఉండటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌-పాకిస్తాన్ విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చడం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై చర్చలో భాగంగా మాట్లాడిన తేజస్వీ సూర్య.. బ్రిటీష్ పాలకులు భారత్- పాకిస్తాన్‌ దేశాలను విభజించిన దానికంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణను వేరు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు.. అటు బీఆర్ఎస్ నేతలతోపాటు.. కవిత కూడా తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ.. ప్రకటనలు విడుదల చేశారు.