ఏపీలో వింత వాతావరణం.. ఓ వైపు ఎండ, మరోవైపు వర్షాలు, నేడు ఈ జిల్లాల్లో వానలకు ఛాన్స్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నాయి. ఒకవైపు భానుడి ప్రతాపంతో ఎండ తీవ్రత పెరుగుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు ఉపశమనం కలగిస్తున్నాయి. నేడు, రేపు కూడా రాష్ట్రంలో ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.వాతావరణ శాఖ విశ్లేషణల ప్రకారం.. తెలంగాణ నుంచి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నేడు, రేపు (సోమవారం) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాలిలో తేమ పెరగడం, ద్రోణి ప్రభావంతో పిడుగులు పడే ముప్పు కూడా అధికంగా ఉందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి కీలక సూచనలు జారీ చేసింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో రైతులు, పశుకాపరులు, కూలీలు పొలాల్లో ఉండకూడదని, ముఖ్యంగా చెట్ల కింద నిలబడవద్దని కోరింది. పిడుగుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన భవనాల్లో ఉండాలని సూచించింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కూడా రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు వాతావరణం విభిన్నంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.ఇక శనివారం పలు జిల్లాల్లో నమోదయ్యాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా గూడూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 44.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.5 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కొమరోలు 43 డిగ్రీలు, కాకినాడ జిల్లా కరప, శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో 42.9 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు 42.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 42.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా నూలివీడులో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. మెుత్తంగా 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు.