HDFC Q4 Results: గత ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి జనవరి- మార్చి త్రైమాసికం ఫలితాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విడుదల చేసింది. ఈ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 8.04 శాతం పెరిగినట్లు వెల్లడించింది. గత మూడు నెలల్లో తమ బ్యాంకుకు రూ.20,350.76 కోట్ల నికర లాభం వచ్చిందని తెలిపింది. ఏడాది క్రితం ఇదే నాలుగో ఈ ఏడాది అది 8 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది. స్టాండలోని ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ.18,63.75 కోట్ల నుంచి 9.11 శాతం మేర పెరిగి రూ.19,221.05 కోట్లకు చేరినట్లు తెలిపింది.ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.9,488 కోట్ల నుంచి రూ.89,809 కోట్లకు చేరినట్లు తెలిపింది. మొత్తం ఖర్చులు రూ.62,951 కోట్ల నుంచి రూ.62,006 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్థుల రేషియో 1.24 శాతం నుంచి 1.15 శాతానికి మెరుగైనట్లు తెలిపింది. మొత్తం కేటాయింపులు రూ.3,193 కోట్ల నుంచి రూ.2,610 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. సమీక్షిస్తున్న క్యూ3 త్రైమాసికంలో కీలక నికర వడ్డీ ఆదాయం 3.2 శాతం పెరిగిందని, రూ.33,080 కోట్లకు చేరిందని తెలిపింది. ఇక బ్యాంకు రుణాల వితరమలో 12 వృద్ధి నమోదైనట్లు తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 3.38 శాతానికి పెరగడం ఇందుకు తోడ్పడినట్లు తెలిపింది. వడ్డీ యేతర ఆదాయం రూ.13,250 కోట్లకు నమోదైనట్లు వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల చిరు వ్యాపారులు, చిన్న, మధ్య తరహా కంపెనీల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం ఉందని, ఉద్రిక్తతలు తగ్గుముఖ పట్టినప్పటికీ దాదాపు రెండు నెలల వరకు ఈ ప్రభావం ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ తెలిపారు. అతాను చక్రవర్తి రాజీనామా వ్యవహారంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అయితే అతాను చక్రవర్తి రాజీనామా తర్వాత బ్యాంకుకు మద్దతుగా నిలిచినందుకు ప్రభుత్వం, సెబీ, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నత స్థాయి అధికారుల బాధ్యతల్లో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపారు. డిప్యూటీ ఎండీ కైఝుద్ భరూచాకు అదనపు బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. ఇటీవలే అతాను చక్రవర్తి రాజీనామాతో బ్యాంక్ షేరు భారీగా పడిపోయింది. మేనేజ్మెంట్ విషయంలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.