: బంగారం కొనుగోలుకు అక్షయ తృతీయ ఒక మంచి సందర్భం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని, భవిష్యత్తులో మంచి లాభాలు అందుతాయని భారతీయుల భావిస్తారు. ఏ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ అంటే ఈరోజు అక్షయ తృతీయ వచ్చింది. ఇవాళ బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గు చూపుతారు. బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో నిడిపోతాయి. అయితే, గత కొద్ది రోజుల నుంచి ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట మార్చడంతో ఊహించని మార్పులు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. హార్ముజ్ జల సంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలకు అనుమతిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో బంగారం ధరలు క్రితం రోజు భారీగా పెరిగాయి. అక్షయ తృతీయ ముందు రోజు బంగారం ధరలు పెరగడంతో మళ్లీ పెరుగుతాయని అంతా భావించారు. అయితే ఇవాళ పసిడి రేట్లు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 19వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లోనూ ఈరోజు బంగారం ధరలు మారలేదు. బులియన్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4831 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, చమురు ధరలు మరింత దిగివస్తే బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాల 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,780 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఏ మార్పు లేకుండా రూ.1,42,800 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో వెండి ధరలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో వెండి ధర మళ్లీ వేగంగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగిన వైట్ మెటల్ మళ్లీ పెరుగుతుండడం గమనార్హం. క్రితం రోజు కిలోకు రూ.5000 పెరిగింది. ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద అమ్ముడవుతోంది.