లక్ అంటే వీళ్లదే.. 2 ఏళ్లకే లక్షకు రూ.1.75 కోట్లు.. ఇప్పుడు 100 షేర్లకో 400 షేర్లు ఇస్తోన్న కంపెనీ!

Wait 5 sec.

Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరిలోని జువెలరీ సెక్టార్ కంపెనీ () కంపెనీ బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ సంస్థ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 4:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేస్తామని తెలిపింది. ఈ బోనస్ షేర్ల రికార్డు డేట్ ఏప్రిల్ 24గా నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఈ కంపెనీ చివరి ట్రేడింగ్ సెషన్లో సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. ఏప్రిల్ 24వ తేదీన ఈ స్టాక్ ఎక్స్ బోనస్ ట్రేడింగ్ నిర్వహించనుంది. ఆలోపు షేర్లు కొనుగోలు చేసి కొనసాగిన . అంటే 500 షేర్లు వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత రెండేళ్లలోనే 17,442 శాతం లాభాన్ని అందించి లో నిలిచింది. ఒకవేళ రెండేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 1.75 కోట్లు అవుతుంది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తాజాగా బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 4:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలుపారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరు కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 4 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. అలాగే ఈ బోనస్ షేర్లకు సంబంధించిన రికార్డు డేట్ ఏప్రిల్ 24, 2026గా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించింది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో వేగా జువెలర్స్ లిమిటెడ్ షేరు 0.01 శాతం లాభంతో రూ. 312.25 వద్ద ముగిసింది. ఇక 52 వారాల గరిష్ఠ ధర రూ. 312.25 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 46.36 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం లాభాన్ని అందించింది. ఇచ్చింది. గత ఏడాదిలో 560 శాతం లాభాన్ని ఇచ్చింది. చివరగా గత రెండేళ్లలో 17,442 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 317.75 కోట్ల వద్ద ఉంది. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. నిపుణుల సలహా మేరకు పెట్టుబడి పెట్టడం మంచిది.