భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లు, ప్రమాద బీమా.. మంత్రి వివేక్ కీలక ప్రకటన

Wait 5 sec.

రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. మరీ ముఖ్యంగా ఇవ్వాలని.. త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు.రానున్న రోజుల్లో తెలంగాణలోని ప్రతి జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సంఘం భవనాన్ని కూడా నిర్మాణం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి.. రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. పెన్షన్లతోపాటు ప్రమాద బీమాను కూడా అందించేందుకు కావాల్సిన కార్యాచరణను త్వరలోనే రెడీ చేస్తామని మంత్రి వివేక్ భరోసా కల్పించారు.అదే సమయంలో గతంలో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం తన తండ్రి, కాకా వెంకటస్వామి కృషి చేసినట్లు మంత్రి వివేక్ గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడి, పోరాటం చేసి మరీ సింగరేణి భూముల రక్షణతోపాటు.. కార్మికులకు పెన్షన్లు అందించేందుకు ఎంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు. కార్మికులకు ప్రమాద బీమాను రూ.10 లక్షలకు కాంగ్రెస్ సర్కార్ పెంచినట్లు గుర్తు చేశారు. గిగ్ వర్కర్స్ భద్రత కోసం అసెంబ్లీలో చట్టాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు.మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేటలో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం భవనానికి స్థలం కేటాయింపుతోపాటు దాని నిర్మాణానికి కూడా హామీ ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో హామీలు ఇచ్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపణలు చేశారు.