IPL మ్యాచ్ లైవ్‌లోనే బ్లాక్ మ్యాజిక్.. సన్‌రైజర్స్ ఫ్యాన్ నిమ్మకాయ మంత్రం, దెబ్బకు శివమ్ దూబే బౌల్డ్!

Wait 5 sec.

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగానే ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని చేతబడి చేసేశాడు. నిమ్మకాయ పట్టుకుని ఓం భీమ్ బుష్ అనేసరికి శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఆ అభిమాని ఒక్కసారిగా షాకై కేకలు పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ అభిమాని చేతబడి చేయడంతోనే సీఎస్కే ఓడిపోయిందంటూ ఇంకొందరు ఫ్యాన్స్ ఫన్నీగా ఓ ఫేక్ పోస్ట్ కూడా పెట్టేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు గెలిచినంత పని చేసింది. కానీ, ఆఖర్లో వికెట్లు పడటంతో మ్యాచ్ మలుపుతిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో తడబడిని సీఎస్కే మధ్యలో ఒక్కసారిగా పుంజుకుంది. ఇక ఆఖరి నాలుగు ఓవర్లలో 46 పరుగులు కావాలి.. క్రీజులో శివమ్ దూబే, జెమీ ఓవర్టన్ ఉండటంతో మ్యాచ్ సీఎస్కేది అనే అందరూ అనుకున్నారు. 17వ ఓవర్‌లో షాకీబ్ హుస్సేన్ ఎవ్వరూ ఊహించని విధంగా బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడం కాకుండా, శివమ్ దూబే వికెట్ తీసుకున్నాడు. 17వ ఓవర్ కీలకం కావడంతో శివమ్ దూబే స్ట్రయికింగ్‌కి వచ్చిన సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ వేసుకున్న ఓ అభిమాని, చేతిలో నిమ్మకాయ తిప్పుతూ ఏదో మంత్రం చదివాడు. వెంటనే కెమెరా గ్రౌండ్ వైపు చూయించడంతో అప్పుడే షాకీబ్ వేసిన బంతికి దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ ఫ్యాన్ చేతబడి చేశాడంటూ నెట్టింట వీడియో వైరల్ అయింది. ఇది ఫన్నే అయినా, ఆ సమయంలో అలా జరగడంతో వీడియో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ గెలిచిన మూడు మ్యాచ్‌లు కూడా సెకండ్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచిన సీఎస్కే, మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి రాగా, చెన్నై ఏడో స్థానంలో ఉంది.