పెరుగు తినమన్నందుకు అలిగి వెళ్లిన భార్య.. కేపీహెచ్‌బీలో వింత కేసు, పాపం ఆ భర్త

Wait 5 sec.

దంపతుల మధ్య గొడవలు సహజం. అంటుంటారు. సాధారణంగా దంపతుల మధ్య గొడవలు ఆర్థిక ఇబ్బందుల వల్లో, ఇతర కుటుంబ సమస్యల వల్లో వస్తుంటాయి. కానీ.. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిధిలోని శంషిగూడలో విషయంలో వచ్చిన చిన్న మాట పట్టింపు ఓ వివాహిత అదృశ్యానికి దారితీసింది. భర్త చేసిన సరదా వ్యాఖ్యను తీవ్రంగా పరిగణించిన భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.శంషిగూడకు చెందిన శివ కుమార్, రాజేశ్వరి దంపతులు. భార్య రాజేశ్వరి కాస్త సన్నగా ఉండటంతో.. భర్త శివ కుమార్ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధతో 'నువ్వు చాలా సన్నగా ఉన్నావు, కొంచెం పెరుగు తినడం అలవాటు చేసుకో.. అప్పుడైనా ఒళ్లు వస్తుంది' అని అన్నాడు. భర్త మంచి కోరి చెప్పినప్పటికీ రాజేశ్వరి ఆ మాటను మనసులో పెట్టుకుంది. అది తనను అవమానించినట్లుగా భావించి తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త అన్న మాటతో అలిగిన రాజేశ్వరి.. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయింది. రాత్రి కావొస్తున్నా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన శివకుమార్.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో చివరకు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియుడితో కలిసి అయిదేళ్ల కొడుకును చంపిన తల్లిఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే సాకుతో.. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారిని ఓ తల్లి తన ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చింది. శ్రీరాంనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బీబీపేట మండలానికి చెందిన నర్సింలు, రాజంపేట మండలానికి చెందిన ఓ మహిళ గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. సదరు మహిళ తన భర్తకు దూరంగా ఉంటూ ఎనిమిదేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు శ్రావణ్‌తో కలిసి కామారెడ్డిలో నివసిస్తోంది. వీరి వివాహేతర సంబంధానికి బుద్ధిమాంద్యం కలిగిన కుమారుడు అడ్డుగా మారాడని భావించిన ఆ జంట చిన్నారిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. కూతురిని పుట్టింటి వద్ద వదిలిపెట్టవచ్చని, కానీ కుమారుడిని మాత్రం హతమార్చడమే మేలని నిశ్చయించుకున్నారు. శుక్రవారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయం చూసి నర్సింలు మద్యం మత్తులో చిన్నారిపై దాడికి దిగాడు. అభం శుభం తెలియని ఆ బాలుడి కళ్లలో కారం చల్లి అనంతరం కర్రతో తలపై బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు నిందితుడు నర్సింలుతో పాటు బాలుడి తల్లిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.