'అమెరికా దిగ్బంధనం కొనసాగితే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసేస్తాం': ఇరాన్ తీవ్ర హెచ్చరిక

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ శనివారం సంచలన ప్రకటన చేశారు. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగితే.. సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచే ప్రసక్తే లేదని ఆయన వాషింగ్టన్‌కు అల్టిమేటం జారీ చేశారు.సోషల్ మీడియాలో వార్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలపై గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. "ట్రంప్ కేవలం ఒక్క గంట వ్యవధిలో ఏడు అబద్ధాలు చెప్పారు. యుద్ధంలో గెలవలేని వారు, చర్చల ద్వారా సాధించేదేమీ ఉండదు" అని ఎద్దేవా చేశారు. జలసంధిని తెరవడమో, మూసివేయడమో అనేది సోషల్ మీడియా పోస్టులు నిర్ణయించవని.. అది క్షేత్రస్థాయిలో తమ సాయుధ దళాల చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై ఈ జలసంధి గుండా ప్రయాణించాలంటే ఇరాన్ అనుమతి తప్పనిసరి అని, తాము సూచించిన మార్గంలోనే నౌకలు వెళ్లాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.శుక్రవారం రోజే హార్మూజ్ తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్..అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రకటించారు. దీనిని స్వాగతించిన ట్రంప్.. ఇరాన్ మరెన్నడూ ఈ మార్గాన్ని మూసివేయబోమని తమకు మాట ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్‌తో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కుదిరే వరకు తమ చేయడం టెహ్రాన్‌కు ఆగ్రహం కలిగించింది. ఈ ఏకపక్ష దిగ్బంధనం కొనసాగితే తాము కూడా జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ వెనక్కి తగ్గింది.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఒకవేళ ఈరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తొలి విడత చర్చలు విఫలం కావడంతో.. రెండో విడత చర్చలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇటీవలే వెళ్లారు. అక్కడి నేతలతో చర్చించి చర్చలకు ఒప్పంచారు. కానీ అంతలోనే మళ్లీ ఇరు దేశాల మధ్య హార్మూజ్ జలసంధి వివాదం రేగడం సంచలనంగా మారింది.