ఏపీలో డ్వాక్రా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు.. 72 గంటల్లోనే అకౌంట్‌లో డబ్బులు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం పథకాలను అమలు చేస్తోంది. వీటిలో రుణాలు అందించే పథకాలు కూడా ఉన్నాయి.. అయితే డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీకి సంబంధించి ఇబ్బందులుపడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. గతంలో డ్వాక్రా మహిళలు రుణం తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ వారాల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై ఆ సమస్యలు లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.. రుణం అందించే ప్రక్రియ మొత్తాన్ని డిజిటలైజ్‌ చేయనుంది. ఈ కొత్త విధానంతో రుణాల మంజూరులో అక్రమాలకు అవకాశం ఉంగడదని చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సెర్ప్ ఒక కొత్త (గ్రామీణ పేదిరక నిర్మూలన సొసైటీ) యాప్‌‌ను తీసుకొచ్చింది.రాష్ట్రంంలో మొత్తం 8.43 సంఘాల్లో 85.75 లక్షలమంది డ్వాక్రా మహిళలు సెర్ప్ పరిధిలో ఉన్నారు. వీరంతా బ్యాంకు లింకేజీ ద్వారా ప్రతి ఏటా భారీగా రుణం తీసుకుంటున్నారు. కొంతమంది ఈ రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడడ్డారు.. బోగస్ సంఘాల పేరుతో రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతి డ్వాక్రా సంఘానికి ఒక యూనిక్ ఐడీ ఉండేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు కూడా ప్రత్యేకంగా ఐడీ నంబర్ కేటాయించి డిజిటలైజ్ చేశారు. డ్వాక్రా సంఘాల యూనిక్ ఐడీతోనే రుణాలు ఇస్తారు... అప్పుడు ఎలాంటి సమస్య ఉండదంటున్నారు. .గతంలో రుణాలు తీసుకునేందుకు చాలా ప్రక్రియ ఉండేది. డ్వాక్రా సంఘంలో తీర్మానం రాయడం దగ్గర నుంచి లోన్ తీసుకునే వరకు ఉంటుంది. కానీ ఈ యాప్‌తో ఇక ఆ ఇబ్బందులు ఉండవు.. ఎందుకంటే ఈ యాప్‌లో గ్రూపులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఏదైనా డ్వాక్రా సంఘం రుణం తీసుకుంటే.. సభ్యులందరికి ఆ రుణాన్ని విభజించి యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత తీర్మానాన్ని అప్‌లోడ్ చేసి.. డ్వాక్రా సంఘంలో లోన్ తీసుకునే మహిళల నుంచి డిజిటల్ సంతకం తీసుకుంటారు. అనంతరం వీవోఏ డిజిటల్ సంతకం చేయగానే సీసీకి వెళుతుంది, తర్వాత ఏపీఎంకు వెళుతుంది. అక్కడి నుంచి బ్యాంక్ మెనేజర్‌కు చేరుతుంది.. అక్కడ వివరాలను పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం యాప్ ద్వారానే జరుగుతుంది.. మొత్తం 72 గంటల్లోనే పూర్తి చేసేలా కసరత్తు చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు అంశాన్ని ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఎక్కడైనా ఈ ప్రక్రియ ఆలస్యమైతే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారు. అంతేకాదు రుణం, ఎంత, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలో యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. డ్వాక్రా సభ్యుల ఐడీ నంబర్‌ ఎంటర్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ కొత్త విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆమోదం తెలియజేగానే అమలు చేస్తారు.