ఐ జరగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు ఒకే పొజిషన్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ 5లో నిలవనుంది. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో సీఎస్కేకి అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పల్‌లో సీఎస్కే సన్‌రైజర్స్‌కి ఉన్న రికార్డు అలాంటిది. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన సీఎస్కే, ఉప్పల్‌లో మాత్రం జీరోనే. గత ఎనిమిదేళ్లలో ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ వేదికపై ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్ హైదరాబాదే విజయం సాధించింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులలో మాత్రం సీఎస్కేదే పైచేయి. ఈ రెండు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరిగే సీఎ్కక్కే 15 మ్యాచ్‌లలో విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 7 మ్యాచ్‌లలో గెలిచింది. గతేడాది రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా ఎస్ఆర్‌హెచే విజయం సాధించింది. ఇక చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌లలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 - 2తో లీడింగ్‌లో ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి, మూడు ఓడింది. రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ డామినేటింగ్ విక్టరీ సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐదు ఆడి మూడు ఓడి, రెండు గెలిచింది. చివరగా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి చెన్నై మంచి జోష్‌లో ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే / లియామ్ లివింగ్ స్టోన్, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషాన్ మలింగ, షాకీబ్ హుస్సేన్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాసంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, డివాల్డ్ బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, జెమీ ఓవర్టన్ / మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్‌జపనీత్ సింగ్, ముకేశ్ చౌదరి.