ఉద్యోగులకు శుభవార్త.. 60 శాతానికి పెరిగిన డీఏ.. బకాయిలతో కలిపి అకౌంట్లోకి డబ్బులు!

Wait 5 sec.

Central Government Employees: ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్- ) పెంపునకు తాజాగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 58 శాతంగా ఉన్న డీఏ.. ఇప్పుడు 60 శాతానికి చేరినట్లయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) కూడా పెరుగుతుందని తెలిపింది. ఇప్పుడు ఈ డీఏ, డీఆర్ పెంపు.. జనవరి 1 నుంచే అమల్లోకి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. జనవరి నుంచి బకాయిలతో కలిపి ఇప్పుడు ఏప్రిల్ నెల జీతంతో చెల్లిస్తారన్నమాట. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 49 లక్షల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ఇదే సమయంలో 64 లక్షల మందికిపైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పొచ్చు. పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు.. ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌ను కేంద్రం ప్రకటిస్తుంటుంది. దాదాపు ప్రతిసారీ దీనిని పెంచుతుందని చెప్పొచ్చు. చివరిసారిగా గత అక్టోబరులో డీఏ, డీఆర్‌ను 3 శాతం పెంచి.. 55 నుంచి 58 శాతానికి చేర్చింది. ఇది 2025, జులై 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం 2 శాతం పెరగ్గా.. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నమాట. డీఏ అనేది.. ఉద్యోగుల బేసిక్ పే పై వర్తిస్తుంది.సాధారణంగా కేంద్రం ఏటా జనవరి 1, జులై 1 నే డీఏపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. కానీ ఏటా ప్రథమార్థంలో హోలీ సమయంలో మార్చిలో ఒకసారి.. తర్వాత రెండో అర్ధభాగంలో దీపావళి సమయంలో అక్టోబర్/నవంబరులో ప్రకటిస్తూ వస్తోంది. ఎప్పుడు ప్రకటించినా.. జనవరి 1, జులై 1 నుంచే అమలు చేస్తుంటుంది. ఆ నెలలకు సంబంధించి బకాయిలతో కలిపి జీతంతో పాటు చెల్లిస్తుంది. ఇప్పుడు 7వ వేతన సంఘం గడువు 2025, డిసెంబర్ 31 తోనే ముగిసిన నేపథ్యంలో.. కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే . ఏకంగా 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరుకుంటోంది. ఇదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేల నుంచి ఒకేసారిగా రూ. 69 వేలకు చేరుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం తమపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు డీఏ పెంపుపై ప్రకటన చేసింది. సాధారణంగా ఈ డీఏ ప్రకటన హోలీ సమయంలో గత నెలలోనే రావాల్సి ఉన్నా.. చాలా ఆలస్యమైంది.