: పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. కొద్ది రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తొలుత అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా.. ఇది రెండు వారాల పాటు అమల్లో ఉండనుంది. అయితే ఇజ్రాయెల్.. లెబనాన్‌పై దాడులు చేస్తున్న క్రమంలో హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయనుకునే లోపే ఇప్పుడు ఇజ్రాయెల్- లెబనాన్ కూడా సీజ్ ఫైర్ డీల్ చేసుకున్నాయి. దీంతో పేర్కొంది. అమెరికా కూడా ఇరాన్ ప్రకటనను ధ్రువీకరించింది. ఇరాన్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపి స్వాగతించారు. ఈ క్రమంలోనే త్వరలోనే యుద్ధం ముగుస్తుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ తొలి దశ శాంతి చర్చలు విఫలం కాగా.. ఇప్పుడు రెండో దశ చర్చల కోసం సన్నాహాలు సాగుతున్నాయి. మరికొద్దిరోజుల్లో చర్చలు ఉండనున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏప్రిల్ 17-18 తేదీల్లో భారీగా దిగొచ్చాయి. ఇరాన్ ప్రకటనకు ముందు బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 100 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇది ఇంట్రాడేలో ఒక దశలో 12 శాతానికిపైగా తగ్గి 86 డాలర్ల వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. చాలా రోజుల తర్వాత క్రూడాయిల్ ధర ఈ స్థాయికి చేరడం గమనార్హం. ప్రస్తుతం 91 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొద్దిరోజుల్లో క్రూడాయిల్ రేట్లు ఇంకా పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. యుద్ధానికి ముందు ముడి చమురు ధర సుమారు 70 డాలర్ల దిగువనే ఉండేది. ఎప్పుడైతే.. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయో అక్కడి నుంచి రికార్డు స్థాయిలో పెరుగుతూ వెళ్లాయి. ఈ క్రమంలోనే ఒక దశలో క్రూడాయిల్ ధర 120 డాలర్ల మార్కు వద్ద గరిష్ఠాన్ని కూడా తాకింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఈ స్థాయిలో ఉండగా.. మళ్లీ ఇరాన్ యుద్ధంతో అదే స్థాయికి చేరింది. 120 డాలర్ల నుంచి పలు మార్లు హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చింది. ఇప్పుడు 90 డాలర్ల దిగువకు కూడా చేరింది. మరోవైపు...