కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తాజాగా స్పందించారు. ఈ బిల్లు వీగిపోవడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ఆమె అభివర్ణించారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మహిళలను అడ్డం పెట్టుకుని అధికారంలో కొనసాగాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. అయితే చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో శుక్రవారం జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయమని ప్రియాంక గాంధీ అభివర్ణించారు. సమాఖ్య నిర్మాణాన్ని మార్చేసి.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలనే మోదీ సర్కార్ కుట్ర ఓడిపోయిందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగానికి, దేశానికి, ప్రతిపక్షాల ఐక్యతకు లభించిన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఈ ఓటమి అధికార పార్టీ నేతల ముఖాల్లో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏదో రకంగా అధికారంలో ఉండాలనేది ఎన్డీఏ సర్కార్ కుట్ర అని.. అందుకే మహిళలను ఉపయోగించుకుని శాశ్వతంగా అధికారంలో ఎలా ఉండాలో ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందితే తాము గెలుస్తామని.. ఒక వేళ ఆమోదం పొందకపోతే ప్రతిపక్షాలను మహిళా వ్యతిరేకులుగా ముద్రవేసి.. వారే మహిళా రక్షకులుగా ప్రచారం చేసుకోవాలని మోదీ సర్కార్ భావించిందని మండిపడ్డారు.ఈ నేపథ్యంలోనే 2023లో అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ల బిల్లును తిరిగి తీసుకురావాలని ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడే మహిళలకు హక్కులు కల్పించండి అని పేర్కొన్నారు. డీలిమిటేషన్ వంటి ఇతర అంశాలతో మహిళా రిజర్వేషన్ల బిల్లును ముడిపెట్టి తప్పుదోవ పట్టించకండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమిని ప్రభుత్వానికి ఒక గట్టి షాక్‌గా అభివర్ణించిన .. కేవలం ప్రచారం, మీడియా హైప్ ఇకపై పని చేయవని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు.. కానీ దాన్ని నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), జనాభా గణనతో ముడిపెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.