RCB vs DC: గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ.. రికార్డులు చూస్తే ఓటములే ఎక్కువ! ఢిల్లీపై లాస్ట్ ఇయర్ సీన్ రిపీట్ అవుతుందా?

Wait 5 sec.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా.. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో ఆడనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏడాది ఒక మ్యాచ్‌ని ఇలా గ్రీన్ జెర్సీ వేసుకుని ఆర్సీబీ ఆడుతుంది. సమాజంలో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తుంది. అయితే, గ్రీన్ జెర్సీ వేసుకున్న రోజు ఆర్సీబీ విజయాల కంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లలో ధరించింది. అందులో కేవలం ఐదుసార్లే విజయం సాధించగా, 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుండటంతో ఫ్యాన్స్‌లో కొంచెం భయం మొదలైంది. గతేడాది చిన్నస్వామి వేదికపై ఆర్సీబీని ఢిల్లీ ఓడించింది. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో ఆర్సీబీ బౌలర్లను చిత్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో గెలిచిన అనంతరం కేఎల్ రాహుల్ చేసిన కాంతార సెలబ్రేషన్స్ ఇప్పటికీ గుర్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 33 సార్లు తలపడ్డాయి. అందులో ఆర్సీబీ ఆధిపత్య విజయాలు సాధించింది. ఆర్సీబీ 20 మ్యాచ్‌లలో గెలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఆఖరి ఐదు మ్యాచ్‌లలో ఢిల్లీ రెండు సార్లే గెలవగా, ఆర్సీబీ మూడింటిలో గెలిచి డామినేటింగ్ పొజిషన్‌లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనాఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ / జేకబ్ డప్ఫీ, సుయాశ్ శర్మ, రసిక్ దార్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంచనాపాతూమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, టి.నటరాజన్, ముకేశ్ కుమార్.