ఆడపిల్ల పెళ్లికి సవర బంగారం, మహిళలకు రూ.2,500, ఏడాదికి 6 ఫ్రీ సిలిండర్లు.. విజయ్ మేనిఫెస్టో

Wait 5 sec.

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత,మహిళలు, నిరుద్యోగ యువతే లక్ష్యంగా టీవీకే మేనిఫెస్టోలో హామీల గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారం చేపడితే 60ఏళ్ల లోపు ఉన్న మహిళలకు నెల నెల రూ.2500 ఆర్థిక సాయం, పేదింటి యువతుల పెళ్లిళ్లకు సవర (8 గ్రాములు) బంగారం, నాణ్యమైన కంచిపట్టు చీర ప్రభుత్వం తరఫున అందజేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అలాగే, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, అమ్మ ఒడి వంటి పథకాలను ప్రకటించారు. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో విద్యార్థుల డ్రాప్‌ఔట్‌లను తగ్గించేలా వారి తల్లులకు ఏటా రూ.15000 ఆర్థిక సాయం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అన్నదాతలపై కూడా విజయ్ వరాల జల్లు కురిపించారు. , అంతకు మించి ఉంటే 50 శాతం రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పంటలకు కనీస మద్దతు ధరను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. వరికి క్వింటాల్‌కు రూ.3500, చెరకు టన్నుకు రూ.4500 చెల్లిస్తామని చెప్పారు.పేదలకు కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, డిగ్రీ పూర్తిచేసిన ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.4 వేలు, ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఐదు లక్షల మందికి స్టయిపెండ్‌తో ఇంటర్న్‌షిప్, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలకు రూ.3వేల పింఛన్ వంటివి మేనిఫెస్టోలో చేర్చారు. 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, రూ.20 వేల వరకు ఉన్నత విద్య రుణాలు, ఇల్లు లేనివారికి ప్రభుత్వ పట్టాలు అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ మంత్రిత్వ శాఖలను ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో రూ.27,000 ఆర్థిక సాయం, చేపలకు కనీస మద్దతు ధర, రూ.25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అంగన్వాడీలకు వేతనాలు రూ.18,000లకు పెంచుతామని, పారిశుద్ధ్య కార్మికులకు రూ.10000, 20 ఏళ్ల పూర్తిచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.15 లక్షలు చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తమిళనాడు’ కార్యక్రమాన్ని, ఎంఎస్ఎంఈలకు రూ. 15,000 కోట్ల రుణాలను కూడా వాగ్దానం చేసింది. 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని, 21 రోజుల్లోనే వ్యాపార లైసెన్సులను జారీ చేస్తామని కూడా టీవీకే హామీ ఇచ్చింది.